రామప్ప ఆలయం నుంచి కాంగ్రెస్‌ విజయభేరి యాత్ర ప్రారంభం

తెలంగాణలో కాంగ్రెస్‌ విజయభేరి యాత్ర ప్రారంభం అయింది.  రామప్ప ఆలయం నుంచి విజయభేరి యాత్ర ప్రారంభమైంది.   రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ  కలిసి ఈ యాత్రను ప్రారంభించారు.  రామప్ప ఆలయం నుంచి ములుగు వరకు బస్సు యాత్ర కొనసాగనుంది.  ఈ యాత్రలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎమ్మెల్యే సీతక్క ఇతర నేతలు పాల్గొన్నారు.  

అనంతరం ములుగులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో  రాహుల్, ప్రియాంక పాల్గొని ప్రసగించనున్నారు.  ఈ సభలోనే  ప్రియాంక కాంగ్రెస్ మహిళా డిక్లరేషన్ ను ప్రకటించనున్నారు.   అంతకుముందు  రాహుల్‌ , ప్రియాంక రామప్ప ఆలయంలో పూజలు నిర్వహించారు.  ఆరు గ్యారంటీల కార్డుకు పూజలు నిర్వహించారు.