2023 నవంబర్ 30న జరగబోయే ఎన్నికల కురుక్షేత్రంలో కాంగ్రెస్ 70 నుంచి 80 సీట్లు గెలుస్తుందని మాజీ ఎంపీ, పాలేరు కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఖమ్మం రూరల్ మండలం కాంగ్రెస్ బూత్ స్థాయి సమావేశంలో పొంగులేటి పాల్గొన్నారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే కాదు రాష్ట్రంలో ఎక్కడయినా ఎవరు, ఎదురొచ్చినా కాంగ్రెస్ విజయాన్ని ఆపలేరని పొంగులేటి చెప్పారు. ఎన్నికలు ఇంకా 23 రోజులే ఉంది కాబట్టి కార్యకర్తలు బాగా కష్టపడాలని తెలిపారు. ఎలాంటి ప్రలోభాలకు, ఎవరి బెదిరింపులకు భయపడొద్దని చెప్పారు. ఇందిరమ్మ రాజ్యం కోసం అందరం కలిసి పని చేద్దామని పొంగులేటి పిలుపునిచ్చారు.
ALSO READ : హామీలు నెరవేర్చకుండా మా గ్రామానికి ఎందుకు వచ్చారు: గ్రామస్థులు