
తొర్రూరు, వెలుగు : ఆరు గ్యారంటీలతో తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని ఆ పార్టీ నాయకురాలు హనుమాండ్ల ఝాన్సీరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం వెలికట్టె, నాంచారిమడూరు గ్రామాల్లో సోమవారం నిర్వహించిన ఇంటింటికీ కాంగ్రెస్ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. పాలకుర్తి ప్రజలు మార్పు కోరుకుంటున్నారన్నారు. మంత్రి ఎర్రబెల్లి ఆగడాలను ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టి ఇబ్బందులు పెడుతున్నారని విమర్శించారు. నియోజకవర్గంలో కాంగ్రెస్ హయాంలో జరిగిన పనులే కనిపిస్తున్నాయన్నారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం ఎస్టీ సెల్ మండల అధ్యక్షుడు జాటోతు రవినాయక్ ఆధ్వర్యంలో వెలికట్టకు చెందిన పలువురు కాంగ్రెస్‌లో చేరారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ కేతిరెడ్డి నిరంజన్‌రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు జాటోత్ హమ్యానాయక్, మండల అధ్యక్షుడు సుంచు సంతోష్, వర్కింగ్ ప్రెసిడెంట్ మేకల కుమార్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షురాలు ఉష పాల్గొన్నారు.