కాంగ్రెస్​కు12 ఎంపీ సీట్లు వస్తాయ్ : బోసురాజు

కాంగ్రెస్​కు12 ఎంపీ సీట్లు వస్తాయ్ : బోసురాజు

కోరుట్ల, వెలుగు: దేశంలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, తెలంగాణలో 17 సీట్లకు గాను 12 స్థానాలను కాంగ్రెస్ గెలవబోతోందని కర్ణాటక రాష్ట్ర ఇరిగేషన్, సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి, ఏఐసీసీ పరిశీలకుడు బోసురాజు  ఆశాభావం వ్యక్తం చేశారు. శుక్రవారం కోరుట్లలోని జువ్వాడి భవన్ లో మాజీ మంత్రి దివంగత నేత జువ్వాడి రత్నాకర్ రావు నాలుగో వర్ధంతి సందర్భంగా ఆయన ఫొటోకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. జువ్వాడి రత్నాకర్ రావు పేద ప్రజల పక్షపాతి అని కొనియాడారు. ప్రధాని మోదీ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని, 10 ఏళ్లలో ఎలాంటి అభివృద్ధి చేయలేదన్నారు. ఎరువులు, విత్తనాలు, పెట్రోల్ , డీజిల్ ధరలను భారీగా పెంచిందన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ  కోరుట్ల నియోజకవర్గ ఇన్ చార్జి జువ్వాడి నర్సింగరావు, జువ్వాడి కృష్ణారావు, కర్ణాటక మడికిరి ఎమ్మెల్యే డాక్టర్ మంత్ర గౌడ తదితరులు పాల్గొన్నారు.