రేపు(మే 03)న తెలంగాణకు స్పెషల్ మేనిఫెస్టో రిలీజ్ చేయనుంది కాంగ్రెస్. శుక్రవారం ఉదయం 11 గంటలకు మేనిఫెస్టోను రిలీజ్ చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాష్ట్రానికి ఏం చేస్తారో మేనిఫెస్టోలో వివరించనున్నారు రేవంత్ రెడ్డి.
విభజన హామీలు, ప్రత్యేక కారిడార్ లు, స్పెషల్ కారిడార్లు, ఇంటర్నేషనల్ స్కూళ్లకు మేనిఫెస్టోలో చోటు కల్పించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ న్యాయ్ పత్ర పేరుతో మ్యానిఫెస్టోను విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీంతో స్పెషల్ మ్యానిఫెస్టోలో ఎలాంటి హామీలను ప్రకటిస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది.