వచ్చే ఏడాది జరగనున్న మధ్యప్రదేశ్ ఎన్నికల్లో కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేస్తుందని రాహుల్ గాంధీ అన్నారు. అధికారంలో ఉన్న బీజేపీ ఎక్కడా కన్పించదని చెప్పారు. బీజేపీ డబ్బును ఉపయోగించి మధ్యప్రదేశ్లో అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు. బీజేపీ ఎన్ని కుట్రలు చేసిన ఆ రాష్ట్రంలో అధికారంలోకి రాదని విమర్శించారు.
భారత్ జోడో యాత్రతో తనకు క్షేత్రస్థాయిలో అనేక విషయాలు అర్థమవుతున్నాయని రాహుల్ అన్నారు. వాటన్నింటినీ గమనిస్తే వచ్చే ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడం అసాధ్యమని అభిప్రాయపడ్డారు. ప్రతిపక్షపార్టీలన్నీ పరస్పరం సహకరించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రత్యామ్నాయ విధానాలతో విపక్షాలు ప్రజల ముందుకెళ్లాలని రాహుల్ సూచించారు.
తాను టీ షర్టు వేసుకోవడంపై ఎందుకంత చర్చ జరుగుతుందో అర్థంకావడం లేదని రాహుల్ గాంధీ అన్నారు. చలి అంటే తనకు భయం లేదని, అందుకే స్వెట్టర్ వేసుకోనని చెప్పారు. తనకు చలిగా అనిపించినప్పుడు స్వెట్టర్ వేసుకుంటానని అన్నారు.