మధిర, వెలుగు: ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 10 అసెంబ్లీ స్థానాలను కాంగ్రెస్గెలవబోతోందని సీఎల్పీ నేత, మధిర ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క ధీమా వ్యక్తం చేశారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా 78 స్థానాలు గెలిచి తమ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పారు. శుక్రవారం మధిరలోని క్యాంప్ఆఫీసులో భట్టి మీడియాతో మాట్లాడారు. గతంలో ఎలక్షన్నోటిఫికేషన్ వచ్చాక కాంగ్రెస్అభ్యర్థులను ప్రకటించేవారని, ఈసారి ముందుగానే ప్రకటించేందుకు హైకమాండ్ కసరత్తు చేస్తోందన్నారు.
గెలుపు గుర్రాలు, సిన్సియారిటీ, సీనియారిటీ తదితర అంశాల ఆధారంగా ఎంపిక జరుగుతోందన్నారు. పార్టీకి సీట్ల కంటే ప్రజలే ముఖ్యమన్నారు. సీఎం కేసీఆర్ఓట్ల కోసం నాటకం ఆడుతున్నారని, 10 సంవత్సరాలు అధికారంలో ఉండి చేయని పనులు 10 రోజుల్లో చేస్తామని చెప్పడం ప్రజలను మోసం చేయడమేనని విమర్శించారు. చిత్తశుద్ధితో పని చేసే సీఎం కావాలా? ఫామ్ హౌస్ లో నిద్రపోయే సీఎం కావాలో? జనం ఆలోచించుకోవాలన్నారు.