నర్సంపేట, వెలుగు : వరంగల్ జిల్లా నర్సంపేటలో 56 ఏండ్ల తర్వాత కాంగ్రెస్ గెలవడంతో ఆ పార్టీ శ్రేణుల్లో జోష్ నెలకొంది. నర్సంపేటలో 1957లో కనకరత్నమ్మ, 1967లో కాసర్ల సుదర్శన్‌రెడ్డి విజయం సాధించారు. తర్వాత ఇప్పటివరకు కాంగ్రెస్ క్యాండిడేట్లు ఎవరూ గెలవలేదు. 2014లో దొంతి మాధవరెడ్డికి కాంగ్రెస్ టికెట్ దక్కకపోవడంతో ఇండిపెండెంట్‌గా ఆటో గుర్తుపై పోటీ చేసి విక్టరీ కొట్టారు. తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు.
2018లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన దొంతి టీఆర్‌ఎస్ క్యాండిడేట్ పెద్ది సుదర్శన్‌రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. ఈ సారి మరోమారు బరిలో నిలిచిన దొంతి మాధవరెడ్డి బీఆర్‌ఎస్ క్యాండిడేట్ పెద్ది సుదర్శన్‌రెడ్డిపై 19,376 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. దొంతి మాధవరెడ్డి గతంలో ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడిగా కూడా పనిచేశారు.