హర్యానాలో ఓట్ల శాతంలో కాంగ్రెస్ హవా

హర్యానాలో ఓట్ల శాతంలో కాంగ్రెస్ హవా

హర్యానాలో ఎన్నికల ఫలితాలు ఉత్కంఠ రేపుతున్నాయి. కాంగ్రెస్, బీజేపీలు పోటాపోటీగా దూసుకెళ్తున్నాయి. హర్యానాలో ఓట్ల శాతంలో కాంగ్రెస్ హవా కొనసాగిస్తోంది. మంగళవారం ( అక్టోబర్ 08) ఉదయం 11 గంటల వరకు లెక్కించిన ఓట్లలో కాంగ్రెస్ కు భారీగా ఓట్లు పడ్డాయి. 

Also Read :- దూసుకెళ్తున్న కాంగ్రెస్ అభ్యర్థి వినేష్ ఫోగట్

కాంగ్రెస్ పార్టీ 40.47 శాతం ఓట్లు సాధించింది. కాంగ్రెస్ పార్టీకి 11 లక్షల 29 వేల 816 ఓట్లు వస్తే.. బీజేపీకి మాత్రం 38.80 శాతం ఓట్ల మాత్రమే వచ్చాయి.బీజేపీ 10 లక్షల 74 వేల 809 ఓట్లతో వెనకబడింది.ఆయా నియోజకవర్గాల్లో లీడింగ్ మాత్రం బీజేపీ ఉంది.