మంథనిలో అవిశ్వాసం నెగ్గిన కాంగ్రెస్

మంథని టౌన్, వెలుగు: మంథని మున్సిపల్‌‌‌‌ కార్యాలయంలో శుక్రవారం ఆర్డీఓ హనుమా నాయక్‌‌‌‌ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో కాంగ్రెస్‌‌‌‌ అవిశ్వాస తీర్మానం నెగ్గింది.  ఈ నెల1వ  తేదీన మంథని మున్సిపల్ చైర్మన్,  వైస్ చైర్మన్లపై పెద్దపల్లి జిల్లా కలెక్టర్‌‌‌‌‌‌‌‌కు అవిశ్వాస తీర్మాన కాపీని ఇచ్చిన కౌన్సిలర్లు ప్రత్యేక శిబిరానికి తరలివెళ్లారు.  

అవిశ్వాస తీర్మానంలో  మున్సిపల్‌‌‌‌  చైర్మన్ పుట్ట శైలజ,   వైస్  చైర్మన్ ఆరెపల్లి కుమార్‌‌‌‌‌‌‌‌లకు వ్యతిరేకంగా కౌన్సిలర్లు చేతులు ఎత్తారు.   ఇద్దరు కాంగ్రెస్,  ఏడుగురు బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌  కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానంలో పాల్గొన్నారు.  చైర్మన్,  వైస్ చైర్మన్లపై అవిశ్వాసం గెలిచినట్లు ప్రకటించారు.