నల్లగొండ జిల్లాలో డీసీసీబీ పీఠాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకుంది. చైర్మన్ పదవి కోసం ఒకే ఒక్క నామినేషన్ దాఖలు కావడంతో ఎన్నిక ఏకగ్రీవమైంది.దీంతో డీసీసీబీ చైర్మన్ గా కుంభం శ్రీనివాస్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు డీసీఓ కిరణ్ కుమార్ జూలై 1న అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డికి 15 మంది డైరెక్టర్లు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయనను సన్మానించారు.
కాగా, డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్‌రెడ్డిపై ఇటీవల అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. జూన్ 28వ తేదీ శుక్రవారం జరిగిన ఓటింగ్‌లో అవిశ్వాసం నెగ్గడంతో మహేందర్‌రెడ్డి చైర్మన్ పదవిని కోల్పోయారు. వైస్ చైర్మన్ ఏసిరెడ్డి దయాకర్‌రెడ్డికి సహకార అధికారులు.. ఇన్‌చార్జి చైర్మన్‌గా బాధ్యతలు అప్పగించారు.