- నాలుగు స్థానాలు హస్తగతం
- మూడు చోట్ల సత్తాచాటిన బీజేపీ
- రెండు స్థానాలకే పరిమితమైన బీఆర్ఎస్
నిజామాబాద్, వెలుగు : ఉమ్మడి జిల్లాలోని తొమ్మిది అసెంబ్లీ సెగ్మెంట్లలో నాలుగు చోట్ల కాంగ్రెస్ విజయం సాధించింది. రూరల్, జుక్కల్, ఎల్లారెడ్డి, బోధన్ హస్తగతం కాగా, కామారెడ్డి, అర్బన్, ఆర్మూర్‌లో కమలం వికసించింది. బాల్కొండ, బాన్సువాడ బీఆర్ఎస్కు దక్కాయి. రూరల్ సెగ్మెంట్లో మొదటి రౌండ్ నుంచి కాంగ్రెస్హవా నడిచింది. కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ భూపతి రెడ్డికి 77,723 ఓట్లు రాగా, బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్‌కు 56,102 ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థి దినేశ్కులాచారికి 49,268 ఓట్లు దక్కాయి.
భూపతిరెడ్డి 21,621 ఓట్ల లీడ్‌తో గెలిచారు. మొత్తం 21 రౌండ్ల కౌంటింగ్జరగగా ఎనిమిదో రౌండ్లో మాత్రమే బీఆర్ఎస్కు 556 ఓట్ల ఆధిక్యత లభించింది. మిగతా అన్ని రౌండ్లలో కాంగ్రెస్‌కు మెజార్టీ లభించింది. ఎల్లారెడ్డి సెగ్మెంట్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన మదన్‌మోహన్‌రావుకు 86,672 ఓట్లు రాగా, ఆయన సమీప ప్రత్యర్థి బీఆర్ఎస్కు చెందిన జాజాల సురేందర్‌కు 62,841 ఓట్లు దక్కాయి. బీజేపీ అభ్యర్థి వడ్డేపల్లి సుభాష్‌రెడ్డికి 26,970 ఓట్లు లభించాయి. కాంగ్రెస్ అభ్యర్థి మదన్మోహన్రావు 23,831 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఇక్కడ కూడా ప్రతీ రౌండ్లోనూ కాంగ్రెస్ ఆధిక్యత చాటింది. బోధన్ లో కాంగ్రెస్ అభ్యర్థి సుదర్శన్‌రెడ్డికి 66,963 ఓట్లు లభించగా, ఆయన సమీప ప్రత్యర్థి, బీఆర్ఎస్ అభ్యర్థి షకీల్ఆమెర్కు 63,901 ఓట్లు వచ్చాయి.
బీజేపీ అభ్యర్థి వడ్డీ మోహన్‌రెడ్డికి 33,555 ఓట్లు పోలయ్యాయి. కాంగ్రెస్అభ్యర్థి సుదర్శన్‌రెడ్డి 3,062 లీడ్‌తో గెలుపొందారు. జుక్కల్కాంగ్రెస్ అభ్యర్థి తోట లక్ష్మీకాంత్రావుకు 64,896, ఆయన ప్రత్యర్థి హన్మంత్‌షిండే(బీఆర్ఎస్)కు 63,372 ఓట్లు దక్కాయి. 1,524 ఓట్ల మెజార్టీతో తోట గెలుపొందారు. బీజేపీ అభ్యర్థి అరుణతారకు 28,437 ఓట్లు లభించాయి.
మూడుచోట్ల కాషాయ జెండా
ఉమ్మడి జిల్లాలో బీజేపీ బలమైన మార్క్ చూయించింది. తొమ్మిది స్థానాలకు గాను మూడు స్థానాలు కైవసం చేసుకుంది. కామారెడ్డిలో బీజేపీ అభ్యర్థి కాటిపల్లి వెంకటరమణారెడ్డి విజయం సాధించారు. బీఆర్ఎస్ నుంచి సీఎం కేసీఆర్, కాంగ్రెస్ నుంచి టీపీసీసీ ప్రెసిడెంట్రేవంత్రెడ్డి పోటీ చేసినా ప్రజలు మాత్రం స్థానికుడైనా కాటిపల్లికే పట్టం కట్టారు.
వెంకటరమణారెడ్డికి 66,652 ఓట్లు రాగా, కేసీఆర్‌కు 59,911 ఓట్లు, రేవంత్‌రెడ్డికి 54,916 ఓట్లు వచ్చాయి. కాటిపల్లి తన సమీప ప్రత్యర్థి కేసీఆర్(బీఆర్ఎస్)పై 6,741 ఓట్ల తేడాతో విజయం సాధించారు. నిజామాబాద్ అర్బన్సెగ్మెంట్లో మొత్తం 21 రౌండ్ల కౌంటింగ్ జరగగా బీజేపీ అభ్యర్థి ధన్పాల్ సూర్యనారాయణకు 75,240 ఓట్లు, ఆయన సమీప ప్రత్యర్థి షబ్బీర్‌అలీ(కాంగ్రెస్)కి 59,853 ఓట్లు లభించాయి. 15,387 ఓట్ల లీడ్‌తో బీజేపీ అభ్యర్థి ధన్పాల్ గెలుపొందారు. బీఆర్ఎస్నుంచి పోటీ చేసిన సిట్టింగ్ఎమ్మెల్యే బిగాల గణేశ్‌గుప్తా 44,829 ఓట్లతో మూడో స్థానానికి పరిమితమయ్యారు.
9 రౌండ్లో మాత్రమే బీఆర్ఎస్372 ఓట్ల లీడ్ సాధించింది. 5, 6, 7, 17, 18,19, 20, 21 రౌండ్లలో కాంగ్రెస్ ఆధిక్యత కనబరిచింది. మిగిలిన అన్ని రౌండ్లలో బీజేపీ హవా కొనసాగింది. ఆర్మూర్ సెగ్మెంట్లో బీజేపీ అభ్యర్థి పైడి రాకేశ్‌రెడ్డికి 71,651 ఓట్లు లభించగా, ఆయన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్‌కు చెందిన పొద్దుటూరి వినయ్‌రెడ్డికి 42,349 ఓట్లు దక్కాయి. 29,302 ఓట్ల లీడ్‌తో రాకేశ్‌రెడ్డి గెలుపొందారు. బీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన సిట్టింగ్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి 39,051 ఓట్లతో మూడో స్థానానికి పరిమితమయ్యారు. ఒక్క 14 రౌండ్లో మాత్రమే కాంగ్రెస్1,694 ఓట్ల లీడ్ సాధించింది. మిగిలిన15 రౌండ్లలో బీజేపీ ఆధిక్యత కొనసాగింది.
రెండు చోట్ల కారు పదిలం
బాల్కొండ నియోకవర్గంలో బీఆర్ఎస్అభ్యర్థిగా పోటీ చేసిన మంత్రి ప్రశాంత్‌రెడ్డి 70,417 ఓట్లు సాధించారు. 4,533 ఓట్ల లీడ్ తో కాంగ్రెస్ అభ్యర్థి ముత్యాల సునీల్‌రెడ్డిపై విజయం సాధించారు. ముత్యాలకు 65,884 ఓట్లు లభించగా, బీజేపీ అభ్యర్థిని ఏలేటి అన్నపూర్ణమ్మ 30,250 ఓట్లు పొందారు. బాన్సువాడ సెగ్మెంట్లో బీఆర్ఎస్అభ్యర్థిగా పోటీ చేసిన స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి 76,278 ఓట్లు సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి ఏనుగు రవీందర్‌రెడ్డి 52,814 ఓట్లు పొందారు. పోచారం శ్రీనివాస్‌రెడ్డికి 23,464 ఓట్ల లీడ్ దక్కింది. బీజేపీ అభ్యర్థి యెండల లక్ష్మీనారాయణకు 23,685 ఓట్లు పోలయ్యాయి.