గోదావరిఖని, వెలుగు : రాష్ట్ర ప్రభుత్వం రామగుండం నియోజకవర్గానికి నర్సింగ్ కాలేజీ, ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరు చేయడంపై హర్షం వ్యక్తం చేస్తూ ఆదివారం గోదావరిఖనిలో కాంగ్రెస్ శ్రేణులు సంబురాలు నిర్వహించాయి. కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు తిప్పారపు శ్రీనివాస్ ఆధ్వర్యంలో మెయిన్ చౌరస్తాలో సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి శ్రీధర్‌బాబు
ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్ ఫొటోలకు క్షీరాభిషేకం చేశారు. మేయర్అనిల్కుమార్, ఏరియా ప్రెసిడెంట్రాజేశ్, ఫ్లోర్ లీడర్ మహంకాళి స్వామి, టీపీసీసీ సెక్రటరీ లింగస్వామి, బాలరాజు, ఎండీ ముస్తాఫా, లక్ష్మణ్‌గౌడ్, రాజ్‌కుమార్, రామస్వామి, ఎల్లయ్య పాల్గొన్నారు.