మేడిగడ్డ దగ్గర హైటెన్షన్ : దూసుకొచ్చిన కాంగ్రెస్ జనం.. పోలీసులతో తోపులాట

మేడిగడ్డ బ్యారెజ్ దగ్గర హై టెన్షన్.. ఉద్రిక్తత నెలకొంది. కుంగిపోయిన మేడిగడ్డ బ్యారెజ్ పిల్లర్లను పరిశీలించటానికి వేలాదిగా తరలివచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలు, నేతలతో ఆ ప్రాంతం ఉద్రిక్తంగా మారింది. బ్యారెజ్ చూడటానికి రాహుల్ గాంధీ రాకతో.. పెద్ద సంఖ్యలో తరలివచ్చారు జనం. ఒక్కసారిగా వచ్చిన పబ్లిక్ ను.. బ్యారెజ్ వైపు దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలోనే పోలీసులతో వాగ్వాదం, తోపులాట జరిగింది. 144 సెక్షన్ అమల్లో ఉందని..  బ్యారెజ్ పైకి ఎవరికీ అనుమతి లేదని.. ఎవర్నీ అనుమతించేది లేదని పోలీసులు అడ్డుకున్నారు.  దీంతో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. భారీగా చేరుకున్న పోలీసు బలగాలు వారిని చెదరగొడుతున్నారు. పోలీసుల తీరుతో కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. 

Also Read :- నవంబర్ 2న మేడిగడ్డకు రాహుల్ గాంధీ

అంతకు ముందు హైదరాబాద్ నుంచి నేరుగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చేరుకున్నారు రాహుల్ గాంధీ.  మేడిగడ్డ బ్యారేజ్ ను  కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించారు. కుంగిన బ్యారేజ్ పిల్లర్లను పరిశీలించారు.  పీసీసీ చీఫ్ రేవంత్, సీఎల్పీ నేత భట్టి,శ్రీధర్ బాబు, విక్రమార్క  ఇతర ముఖ్య నేతలు రాహుల్ తో ఉన్నారు. అనంతరం  మేడిగడ్డ హెలిప్యాడ్ నుంచి హైదరాబాద్ కు తిరుగు పయనం అయ్యారు. 

కాళేశ్వరం ప్రాజెక్టు‌‌‌‌‌‌‌‌లో కీలకమైన మేడిగడ్డ(లక్ష్మీ) బ్యారేజీ పిల్లర్లు  అక్టోబర్ 21 న సాయంత్రం కుంగిపోయిన విషయం తెలిసిందే. దీనిపై  రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేగింది. కాంట్రాక్టర్ల వైఫల్యం, ప్రభుత్వ  పనితీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి.