ఆత్మకూరు, వెలుగు : మేడిగడ్డ పరిశీలనకు వెళ్తున్న సీఎం రేవంత్‌రెడ్డి, ఎమ్మెల్యేలకు ఆఫీసర్లు, కాంగ్రెస్ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. లంచ్ కోసం సీఎం రేవంత్‌రెడ్డి, ఎమ్మెల్యేలు హనుమకొండ జిల్లా దామెర మండలం దుర్గంపేట శివారులోని ఎన్‌ఎస్‌ఆర్ హోటల్‌లో ఆగారు. ఈ టైంలో హనుమకొండ కలెక్టర్ సిక్తా పట్నాయక్, వరంగల్ సీపీ అంబర్ కిశోర్ ఝా సీఎంకు పూలమొక్క అందజేసి స్వాగతం పలికారు.
అలాగే హోటల్ వద్దకు చేరుకున్న కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సీఎంకు పూలమాల వేసి స్వాగతం పలికారు. కార్యక్రమంలో వరంగల్ జిల్లా ఎస్సీ విభాగం వైస్ చైర్మన్ దుపాకి సంతోష్‌కుమార్, వల్లెం సుధాకర్, గాదె శ్రీకాంత్, పిట్టల అనిల్, గాదె క్రాంతి, వల్లెం సాయికుమార్, రాహుల్ పాల్గొన్నారు.