జుకర్‌‌బర్గ్‌కు మరోమారు కాంగ్రెస్ లేఖ

జుకర్‌‌బర్గ్‌కు మరోమారు కాంగ్రెస్ లేఖ

న్యూఢిల్లీ: ఫేస్‌బుక్ సీఈవో మార్క్ జుకర్‌‌బర్గ్‌కు కాంగ్రెస్ పార్టీ మరోమారు లేఖ రాసింది. ఇండియాలో ఫేస్‌బుక్ కార్యకలాపాలపై విచారణలో ఏమేం చర్యలు తీసుకున్నారో చెప్పాలని సదరు లేఖలో కాంగ్రెస్ రాసిందని సమాచారం. వాట్సాప్‌లో విద్వేషపూరిత ప్రసంగాలకు అనుకూలంగా పని చేసేలా జుకర్‌‌బర్గ్‌కు చెందిన ఇండియన్ టీమ్ అనుమతించిందని కాంగ్రెస్ ఆరోపించింది. ఈ నెల 18న జుకర్‌‌బర్గ్‌కు కాంగ్రెస్ లేఖ రాసిన సంగతి తెలిసిందే.

40 కోట్ల మంది వినియోగిస్తున్న వాట్సాప్‌ను బీజేపీ నియంత్రిస్తోందనే ఆరోపణలపై సమాధానం చెప్పాలని కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ డిమాండ్ చేశారు. ఇండియాలో తమ పేమెంట్స్‌ ఆపరేషన్స్‌ను అనుమతిస్తుందనే కారణంతోనే బీజేపీ నియంత్రణకు వాట్సాప్‌ సరేనందని వేణుగోపాల్ విమర్శించారు. ఒకే ఒక్క వ్యక్తి నాయకత్వంలో ఇండియాలో ఓ టీమ్‌ పక్షపాతంగా, అధికార బీజేపీకి అనుకూలంగా పని చేస్తోందంటూ జుకర్‌‌బర్గ్‌పై కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు.