పెద్దపల్లి/గోదావరిఖని, వెలుగు: వన దేవతలు సమ్మక్క, సారలమ్మకు పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గ కాంగ్రెస్ యువనేత గడ్డం వంశీకృష్ణ ప్రత్యేక పూజలు నిర్వహించారు. పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావుతో కలిసి ఆయన గురువారం పెద్దపల్లి నియోజకవర్గంలో పర్యటించారు. సుల్తానాబాద్, ఎలిగేడులో కొలువుదీరిన వన దేవతలు సమ్మక్క, సారలమ్మను దర్శించుకున్నారు. నిలువెత్తు బంగారాన్ని అమ్మవార్లకు వంశీకృష్ణ, విజయరమణారావు సమర్పించుకున్నారు.
నియోజకవర్గంలోని ప్రజలు సంతోషంగా ఉండాలని అమ్మవార్లను కోరుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు ప్రకాశరావు, అంతటి అన్నయ్యగౌడ్, అబ్బయ్య, దామోదర్, బాలసాని సతీష్, ఎలిగేడు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. కాగా, గోదావరిఖనిలోని గోదావరినది ఒడ్డున గల జాతర స్థలానికి జనగామ గ్రామం నుంచి గురువారం సాయంత్రం సమ్మక్కను తీసుకురాగా రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ఠాకూర్తో కలిసి వంశీకృష్ణ పూజలు చేశారు.
ఈ కార్యక్రమంలో లీడర్లు మహంకాళి స్వామి, బొంతల రాజేష్, పి.మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు.