దక్షిణ తెలంగాణపై ఎందుకీ వివక్ష

దక్షిణ తెలంగాణపై ఎందుకీ వివక్ష

నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు : దక్షిణ తెలంగాణ ప్రాజెక్టులపై ప్రభుత్వం వివక్ష చూపుతోందని ఆరోపిస్తూ  జడ్పీ సమావేశం నుంచి కాంగ్రెస్ జడ్పీటీసీలు, ఎంపీపీలు వాక్ అవుట్  చేశారు. గురువారం నాగర్ కర్నూల్ లోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాలులో జడ్పీ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా  కాంగ్రెస్  జడ్పీటీసీలు మాట్లాడుతూ పాలమూరు ప్రాజెక్టును ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. కల్వకుర్తి నియోజకవర్గంలో ఇప్పటికీ కేఎల్ఐ ప్రాజెక్టు నీరు రావడంలేదని మండిపడ్డారు.

లబ్ధిదారులకు బీసీ బంధును ఎందుకు ఇవ్వడం లేదని జడ్పీ వైస్ చైర్మన్ బాలాజీ సింగ్, జడ్పీటీసీ కెవిన్ రెడ్డి ప్రశ్నించారు. భూ నిర్వాసితులకు డబ్బులు ఇవ్వకపోవడం పట్ల  అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.  రేషన్ కార్డులు ఎప్పుడు ఇస్తారో చెప్పాలని పెద్దకొత్తపల్లి జడ్పీటీసీ డిమాండ్ చేశారు.  సమావేశం ప్రారంభంలో తమ సమస్యను ముందుగా చర్చించాలని  జడ్పీటీసీలు పోటీ పడ్డారు.  జడ్పీ చైర్ పర్సన్​ శాంత కుమారి మాట్లాడుతూ ఎన్నికల కోడ్ రావడంతో అత్యవసర శాఖల అంశాలపై చర్చించి ప్రభుత్వానికి నివేదికలు పంపుతున్నట్లు తెలిపారు. సమావేశంలో  సీఈవో ఉష, జడ్పీటీసీలు అనురాధ, లక్ష్మమ్మ, శ్రీశైలం, దయాకర్ రెడ్డి, రాంబాబు, ప్రతాప్ రెడ్డి, మంత్రనాయక్, రోహిణి, సుమిత్ర, గౌరమ్మ, రమాదేవి, మధు, శ్రీనివాసులు పాల్గొన్నారు. 


ALSO READ: జనగామలో గెలిచి కేసీఆర్‌‌కు గిఫ్ట్‌‌ ఇస్తా : పల్లా రాజేశ్వర్‌‌రెడ్డి