ప్రచారంలో వెనుకంజలో ఉన్న కాంగ్రెస్

ప్రచారంలో వెనుకంజలో ఉన్న కాంగ్రెస్
  • ఉసూరుమంటున్న కేడర్‌‌‌‌
  • ఐదు సెగ్మెంట్లలోనే హడావుడి

ప్రచారానికి పట్టుమని వారం రోజుల టైం కూడా లేదు. క్యాం పెయిన్‌‌‌‌లో టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ దూసుకెళ్తుంటే కాంగ్రెస్‌‌‌‌ మాత్రం చతికిల పడిపోయింది. 17 లోక్‌‌‌‌సభ సెగ్మెంట్లలో ఐదింటిలోనే పార్టీ హడావుడి కన్పి స్తోంది. మిగతా 12 సీట్లలో ప్రత్యర్థి పార్టీని గట్టిగా ఎదుర్కోలేక పోతోం ది. గ్రేటర్ పరిధిలోని 2 సెగ్మెంట్లతోపాటు దక్షిణ తెలంగాణలోని 3 నియోజకవర్గాల్లో మాత్రమే కాం గ్రెస్‌‌‌‌ జోష్ కనిపిస్తోంది.

ఎక్కడ ఎట్లుందంటే..?

  • నిజామాబాద్‌‌‌‌లో కారు స్పీడుకు కమలం ముకుతాడు వేస్తోంది. హస్తం జోష్ పెద్దగా కనిపించడం లేదు. అభ్యర్థి మధుయాష్కీ పెద్దగా ప్రచారం చేయడం లేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. తనను ఓడించేందుకు బీజేపీతో కాం గ్రెస్ కుమ్మక్కైం దని, అందుకే యాష్కీ ప్రచారం చేయడం లేదని టీఆర్ఎస్ అభ్యర్థి కవిత ఆరోపిం చడం జిల్లా రాజకీయాల్లో కలకలం రేపింది.
  • వరంగల్ నియోజకవర్గం లో కాం గ్రెస్ అభ్యర్థి దొమ్మాట సాంబయ్య ప్రచారంపై అంతగా దృష్టిసారించలేదు. ఎక్కడోచోట ఎప్పుడోసారి అన్నట్లుగా ఆయన ప్రచారం సాగుతున్నట్టు కాం గ్రెస్ శ్రేణులే చెబుతున్నాయి.
  • మహబూబాబాద్ అభ్యర్థి బలరాం నాయక్ ప్రచారంలో ఎక్కడా కనిపించడం లేదు. దీంతో ఆ పార్లమెంట్ పరిధిలోని ములుగు ఎమ్మెల్యే సీతక్క మల్కాజ్‌‌‌‌గిరికి వెళ్లి పార్టీ క్యాండిడేట్‌‌‌‌ రేవంత్ రెడ్డి తరఫున ప్రచారం చేస్తున్నారు.
  • పెద్దపల్లిలోనూ అంతే. కాం గ్రెస్ అభ్యర్ థి చం-ద్రశేఖర్ బరిలో ఉన్నామా అంటే ఉన్నామనేరీతిలోనే సాగుతోం ది తప్ప.. ప్రచారంలో సీరియస్‌‌‌‌నెస్‌‌‌‌ కనిపించడం లేదని ఆ నియోజకవర్గ నేతలు చెబుతున్నారు. పార్టీ అభ్యర్థి నాన్ లోకల్ కావడంతో ఇక్కడ కాంగ్రెస్ ప్రచారంలో వెనుకబడి పోయిందని కేడర్ అంటోంది.
  • జహీరాబాద్ అభ్యర్థి మదన్ మోహన్ అక్కడి సీనియర్ నేతలను సమన్వయ పర్చుకోలేకపోతున్నారు. ఇటీవల కాంగ్రెస్ చీఫ్ రాహుల్ అక్కడికి వెళ్లడంతో కొంత జోష్ కనిపించినా దాన్ని అలాగే కాపాడుకోవడంలో ఇబ్బం దులు పడుతున్నారు.
  • మెదక్ అభ్యర్థి గాలి అనిల్ ప్రచారం కోసం పార్టీ ప్రముఖులు వచ్చినప్పుడు తప్ప మిగతా రోజుల్లో హడావుడి కన్పించడం లేదని నేతలంటున్నారు.
  • పాలమూరులో వంశీచంద్‌‌‌‌రెడ్డి పోరాటం ప్రభావం చూపించలేక పోతోంది. నిన్నటి వరకు కాంగ్రెస్ లో ఉన్న సీనియర్ నేత డీకే అరుణ ఇటీవలే ఆ పార్టీకి గుడ్ బై చెప్పి బీజేపీలో చేరి ఎన్నికల బరిలో నిలిచారు. దీంతో అక్కడ కాం గ్రెస్‌‌‌‌కు కేడర్ లేకుండా పోయిం ది. ఇక్కడ టీఆర్ఎస్, బీజేపీ మధ్య పోరు సాగుతుం డగా.. హస్తం హడావుడి ఎక్కడా కన్పిం చడం లేదు.
  • నేతలు సహకరించక నాగర్ కర్నూల్ లో మల్లురవి ప్రచారం అంతంతగానే సాగుతోంది. అలంపూర్ మాజీ ఎమ్మెల్యే , ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ తో సమన్వయం లేదు. గెలుపుకోసం ఒంటరి పోరు చేయాల్సిన పరిస్థితి.
  • సికింద్రాబాద్‌‌‌‌లో టీఆర్ఎస్, బీజేపీ నువ్వానేనా అన్నట్టుగా పోటీ పడుతుండగా, కాంగ్రెస్ వెనుకంజలో ఉంది. కాంగ్రెస్ అభ్యర్థి అంజన్ కుమార్‌‌‌‌కు సీనియర్ల సహకారం లేదు.
  • కరీంనగర్‌‌‌‌లో పార్టీ అభ్యర్థి పొన్నం ప్రభాకర్ ప్రచారం నిర్వహిస్తున్నా.. స్థానికంగా ముఖ్యనేతలు టీఆర్ఎస్ కు వలసపోవడం కాంగ్రెస్ కు మైనస్‌‌‌‌గా మారిం ది. మాజీ ఎమ్మెల్సీ సంతోశ్‌కుమార్, మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్‌‌‌‌తోపాటు కరీంనగర్ కార్పొరేటర్లు పలువురు పార్టీకి గుడ్ బై చెప్పడంతో కాంగ్రెస్ ఎదురీదుతోంది. టీఆర్ఎస్, బీజేపీ మధ్య తీవ్ర పోటీ నడుస్తోంది.
  • హైదరాబాద్‌‌‌‌లో కాం గ్రెస్ అభ్యర్థి ఫిరోజ్ ఖాన్ ఉనికి చాటేందుకు అష్టకష్టాలు పడుతున్నారు.
  • ఆదిలాబాద్‌‌‌‌లో రమేశ్‌ రాథోడ్ సీనియర్లను సమన్వయ పరచలేకపోతున్నారు. మాజీ డీసీసీ చీఫ్ మ హేశ్వర్ రెడ్డి, ప్రస్తుత డీసీసీ చీఫ్ సురేఖ భర్త ప్రేంసాగర్ రావు రెం డు వర్గాలుగా చీలడం తలనొప్పిగా మారింది.ఇక్కడ జోష్

    మల్కాజ్‌‌‌‌గిరి, చేవెళ్లల్లో కాంగ్రెస్ అభ్యర్థులు రేవంత్ రెడ్డి, కొండా విశ్వేశ్వర్ రెడ్డిలు టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌కు దీటుగా దూసుకుపోతున్నారు. నల్గొండలో పీసీసీ చీఫ్ ఉత్తమ్ బరిలో నిలవడంతో కాంగ్రెస్ అక్కడ ఊపు మీదుంది. భువనగిరి బరిలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి నిలవడంతో అన్న కోసం తమ్ముడు రాజగోపాల్ రెడ్డి చెమటోడుస్తున్నారు. రేణుకా చౌదరి పోటీలో ఉన్న ఖమ్మంలోనూ పార్టీ జోరు మీదుంది.