వర్షాకాలం వచ్చేసింది, ఆహ్లాదకరమైన వాతావరణంతో పాటు సీజనల్ వ్యాధులు, ఇంఫెక్షన్లను కూడా వెంట తెస్తుంది వర్షాకాలం. వర్షాకాలంలో జలుబు దగ్గు వంటి రెగ్యులర్ సమస్యలతో పాటు కళ్ళ కలక సమస్య కూడా ఎక్కువగా వ్యాపిస్తుంది.కళ్ళ కలక వల్ల కళ్ళు ఎర్రబడడం, పొడిబారడం, దురద, మంట వంటివి ఇబ్బంది పెడతాయి.ఈ సమస్య వల్ల తలనొప్పి కూడా వస్తుంది, ఇది మైగ్రేన్ కి కూడా దారి తీస్తుంది. వర్షాకాలంలో తగు జాగ్రత్తలు తీసుకోవటం వల్ల కళ్ళ కలక బారిన పడకుండా ఉండచ్చు.
కేవలం వర్షాకాలంలోనే కాకుండా అన్ని సీజన్స్ లో కళ్ళ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవటం అవసరం. ముఖ్యంగా గంటల కొద్దీ ఆన్లైన్ ల ఉండటం, సిస్టం ముందు ఎక్కువసేపు వర్క్ చేయటం,రేడియేషన్, పొల్యూషన్ వంటివి కంటి సమస్యలకు దారి తీస్తాయి. అంతే కాకుండా గ్లూకోమా, క్యాటరాక్ట్, మయోపియా వంటి సమస్యలను కూడా నిర్లక్ష్యం చేయద్దని నిపుణులు చెబుతున్నారు. ఈ మధ్యకాలంలో పెరుగుతున్న కంటి సమస్యల వల్ల పిల్లలు, పెద్దలు అన్న తేడా లేకుండా మందమైన కళ్లద్దాలు వాడాల్సిన పరిస్థితి తలెత్తుతోంది.
వర్షాకాలంలో ఎక్కువగా వచ్చే కంటి సమస్యలు:
- కళ్ళ కలక
- వైరల్ ఇన్ఫెక్షన్స్
- బాక్టీరియాల్ ఇన్ఫెక్షన్స్
- అలర్జీ
కళ్ళ కలక లక్షణాలు:
- కళ్ళు ఎర్రబడటం
- పొడిబారటం
- దురద
- కనురెప్పల్లో వాపు
- కళ్లలో నీరు కరాటం
కళ్ళ కలకకు చిట్కాలు:
ఒక టీస్పూన్ తెల్ల ఉల్లిపాయల జ్యూస్, ఒక టీస్పూన్ అల్లం, లెమన్ జ్యూస్, 3టీస్పూన్ల తేనే, 3టీస్పూన్ల రోజ్ వాటర్, తీసుకొని వీటన్నిటిని ఉసిరికాయ జ్యూస్ తో కలిపి రోజూ ఉదయం, సాయంత్రం రెండు చుక్కల చొప్పున కంట్లో వేసుకుంటే ఎలాంటి కంటి సమస్యలైనా దూరం అవుతాయి. దీంతో పాటు క్రమం తప్పకుండా యోగా చేయటం కూడా మంచిది.