గురుకుల పాఠశాలలో 402 మందికి కండ్లకలక..

 రాష్ట్ర వ్యాప్తంగా కండ్లకలక కలవర పెడుతోంది.  రోజురోజుకు కండ్లకలక బాధితులు ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా కండ్లకలక వస్తోంది. ఆస్పత్రుల్లో  కండ్లకలక కేసులే ఎక్కువగా రావడం గమనార్హం..

లేటెస్ట్ గా నిర్మల్ జిల్లా కడెం మండలం‌ నచ్చన్ ఎల్లాపూర్ బాలికల గురుకుల పాఠశాలలో 600 విద్యార్థినీలు ఉండగా.. 402 మందికి కండ్ల కలక వచ్చింది. గురుకులాలలో కండ్ల కలక సోకిన విద్యార్థుల నుండి ఇతర విద్యార్థులకు వేగంగా వ్యాపిస్తున్నాయి.  పేరెంట్స్ వెళ్లి తమ పిల్లలను ఇండ్లకు తీసుకెళ్లేందుకు పర్మిషన్ ఇవ్వాలని  వైస్ ప్రిన్సిపాల్ రాధికను కోరుతున్నారు. కండ్ల కలక వచ్చిన విద్యార్థినిలకు సపరేట్ గదులలో ఉంచామని పేరెంట్స్ ఆందోళన చెందవద్దన్న వైస్ ప్రిన్సిపాల్ చెప్పారు.