ఖైరతాబాద్, వెలుగు: తూర్పు కనుమలకు ప్రత్యేక పరిరక్షణ హోదా ప్రకటించాలని గ్రీన్స్అలయన్స్ (గ్రేస్) కౌన్సిల్ ఫర్ గ్రీన్ రివల్యూషన్ (సీజీఆర్) పబ్లిక్‌పాలసీ సంస్థల ప్రతినిధులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు. శనివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన మీడియా సమావేశంలో పర్యావరణ వేత్తలు ఆర్.దిలీప్ రెడ్డి, కె.లక్ష్మారెడ్డి, దొంతి నరసింహారెడ్డి, కె.తులసీరావు మాట్లాడారు. కేరళలో ఇటీవల వచ్చిన వరదలు మితిమీరిన మానవ జోక్యం వల్లేనన్నారు.
జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రకారం దేశంలోని మొత్తం భూ భాగంలో12.6% కొండ చరియలు విరిగిపడే అవకాశం ఉందన్నారు. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, -ఢిల్లీలో డిపార్ట్‌మెంట్ ఆఫ్ సివిల్ ఇంజనీరింగ్, యార్డి స్కూల్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అభివృద్ధి చేసిన ఇండియా ల్యాండ్ స్లైడ్ ససెప్టబిలిటీ మ్యాప్ ప్రకారం తూర్పు కనుమల్లో కొండ చరియలు విరిగిపడే అవకాశం ఉందని తెలిపారు.