హైదరాబాద్, వెలుగు : ఆసియా గేమ్స్‌లో బ్యాడ్మింటన్ డబుల్స్ కాంపిటీషన్ చాలా టఫ్‌గా ఉంటుందని ఇండియా స్టార్ షట్లర్ సాత్విక్ సాయిరాజ్ చెప్పాడు. చైనాలోని హాంగ్జౌ వేదికగా ఈ నెల 23వ తేదీన మొదలయ్యే ఈ గేమ్స్‌ను తాను మినీ ఒలింపిక్స్‌లా భావిస్తానన్నాడు. ఇందులో మెడల్ గెలిచే అవకాశాలు 50-–50గా ఉన్నాయని శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో పీఎన్‌బీ జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ (జేబీసీ) ట్రోఫీని తన డబుల్స్ పార్ట్‌నర్ చిరాగ్ షెట్టితో కలిసి ఆవిష్కరించిన సాత్విక్ చెప్పాడు.
ALSO READ: నిమ్స్‌లో ఫ్యాకల్టీ పోస్టులు
‘ఆసియా గేమ్స్‌లో పోటీ అంత సులువు కాదు. వరల్డ్ నం. 3 ర్యాంక్‌లో ఉన్నప్పటికీ మేం ఎవ్వరినీ తక్కువగా అంచనా వేయలేం. మేం ఆసియా గేమ్స్‌లో పోటీ పడడం ఇది రెండోసారి. నిలకడగా ఆడితే ఫలితాలు వస్తాయి. మా వరకు ఎక్కువగా ఆలోచించి ఒత్తిడికి గురవకుండా ఒక్కో మ్యాచ్‌పై దృష్టి పెడతాం’ అని తెలిపాడు. కాగా, ఏడో ఎడిషన్ జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్ అంచె పోటీలు అక్టోబర్ 19 నుంచి 23 వరకు ఐదు ఏజ్ గ్రూప్‌ల్లో జరగనున్నాయి. మొత్తం పది సిటీల్లో జరిగే ఈ టోర్నీకి సాత్విక్, చిరాగ్ మెంటార్లుగా ఉంటారని ఆర్గనైజర్లు తెలిపారు.