వికారాబాద్, వెలుగు: రాష్ట్రంలోని సంక్షేమ హాస్టళ్లలో వరుసగా ఫుడ్ పాయిజనింగ్ ఘటనలు చోటుచేసుకోవడం వెనుక కుట్ర కోణం దాగి ఉందని రాష్ట్ర మహిళా కార్పొరేషన్ సహకార అభివృద్ధి సంస్థ చైర్మన్ బొండ్రు శోభారాణి ఆరోపించారు. బుధవారం ఆమె తాండూరులోని గిరిజన సంక్షేమ హాస్టల్‌ను సందర్శించారు. రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజాత, మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్నతో కలిసి అక్కడి పరిస్థితులను, రికార్డులను పరిశీలించారు. అనంతరం శోభారాణి మీడియాతో మాట్లాడారు. హాస్టళ్లలో ఫుడ్పాయిజనింగ్ఘటనల వెనుక బీఆర్ఎస్ నాయకుల పాత్ర ఉందన్నారు.
గతంలో సంక్షేమ హాస్టళ్ల బాధ్యతలు చూసిన ఆ పార్టీ నేత ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ పై అనుమానాలు ఉన్నాయన్నారు. ఎన్ని నోటీసులు ఇచ్చినా భయపడేది లేదన్నారు. పిల్లల జీవితాలతో ఆడుకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కాంగ్రెస్ప్రభుత్వం విద్యార్థులకు డైట్, కాస్మోటిక్ చార్జీలు పెంచడంతోపాటు నాణ్యమైన విద్య, భోజనం అందిస్తుంటే ఓర్వలేక కుట్రలకు పూనుకుంటున్నారని మండిపడ్డారు. ఫుడ్పాయిజనింగ్ఘటనలు పునరావృతం కాకుండా హాస్టళ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ను ఆదేశించారు.