- సినిమా విడుదలకు ముందు నుంచే బెదిరింపులు
- పైరసీ ప్రింట్ లీక్ చేసిన కేటుగాళ్లు
- సైబర్ క్రైమ్‌లో ఫిర్యాదు చేసిన చిత్ర యూనిట్
కోట్లకు కోట్ల రూపాయల ఖర్చుచేసి గ్లోబల్ రేంజ్‌లో ఇమేజ్ ఉన్న ఒక స్టార్ హీరో మూడేళ్లకు పైగా కష్టపడి చేసిన సినిమా విడుదల రోజే నెట్టింట లీక్ అయితే ఆ బాధ ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. సంక్రాంతికి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో 'దిల్' రాజు, శిరీష్ నిర్మించిన 'గేమ్ ఛేంజర్' విడుదల రోజే ఆన్‌లైన్‌లో పైరసీ ప్రింట్ లీక్ అయ్యింది. దీని వెనుక దాదాపు 45 మంది సభ్యుల ముఠా హస్తమున్నట్లు తెలుస్తోంది.
'గేమ్ ఛేంజర్' విడుదలకు ముందు నిర్మాతలతో పాటు చిత్ర బృందంలోని కీలక వ్యక్తులకు సోషల్ మీడియా, అలాగే వాట్సాప్‌లలో కొంత మంది నుంచి బెదింపులు వచ్చాయి. తాము అడిగినంత ఇవ్వకపోతే సినిమా పైరసీ ప్రింట్ లీక్ చేస్తామని హెచ్చరించారని ఆ బెదిరింపుల సారాంశం. 'గేమ్ ఛేంజర్' విడుదలకు రెండు రోజుల ముందు సినిమాలో కీలక ట్విస్టులను సోషల్ మీడియా అకౌంట్‌లలో షేర్ చేశారు. ఇక విడుదలైన తొలి రోజే హోచ్‌డి(HD Piracy Movie Print) ప్రింట్ లీక్ చేయడమే కాదు.. టెలిగ్రామ్, సోషల్ మీడియాలో ఆడియన్స్ అందరికీ షేర్ చేశారు.
Game Changer HD print was leaked online on release day by a group of 45 people, spreading negativity and spoilers on social media. Cybercrime complaints filed... investigation ongoing. Let's stand against piracy and support cinema #stopPiracy #gamechanger pic.twitter.com/8o6j7rIUCz
— RAM (@A_S_H_U_U_) January 13, 2025
'గేమ్ ఛేంజర్' చిత్ర బృందాన్ని బెదిరించిన, పైరసీ ప్రింట్ లీక్ చేసిన 45 మంది మీద ఆధారాలతో సహా సైబర్ క్రైమ్‌లో కంప్లైంట్ చేసింది టీం. ఆ 45 మంది కలిసి ఓ ముఠాగా ఏర్పడి 'గేమ్ ఛేంజర్' మీద నెగెటివిటీ స్ప్రెడ్ చేశారా? పైరసీ ప్రింట్ లీక్ చేశారా? లేదంటే వారి వెనుక మరేవరైనా ఉన్నారా? అనేది తెలియాల్సి ఉంది. ఈ కేసును టేకప్ చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టారు. దర్యాప్తు తర్వాత నిజానిజాలు వెలుగులోకి రానున్నాయి.
ALSO READ | తప్పు జరిగిపోయింది.. పెద్ద మనసు చేసుకుని క్షమించండి.. వీడియో వదిలిన డైరెక్టర్ త్రినాధ రావు
సోషల్ మీడియా (ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్ బుక్, యూట్యూబ్) పేజీలలో ఒక పథకం ప్రకారం 'గేమ్ ఛేంజర్' మీద పలువురు నెగెటివిటీ స్ప్రెడ్ చేశారు. సినిమా క్లిప్స్ షేర్ చేయడంతో పాటు కీలకమైన ట్విస్టులు రివీల్ అయ్యేలా చేసి ఆడియన్స్ సినిమాను ఎంజాయ్ చేయకుండా చేశారు. సదరు పేజీల మీద కూడా కంప్లైంట్స్ నమోదు చేశారు. త్వరలో ఆ సోషల్ మీడియా పేజీల మీద కూడా చర్యలు తీసుకోనున్నట్లు పోలీసులు తెలిపారు.
When will this piracy end?
— lovely 😍😍 (@loves_peoples) January 10, 2025
HD Link Available....#GameChanger 🙋🥵🔥
Game changer (2025) 1080 𝗧𝗲𝗹𝘂𝗴𝘂 𝗛𝗗𝗥𝗶𝗽 available 💥❤️🔥 pic.twitter.com/GHxYa1MgN3