ఆర్మూర్, వెలుగు: మాక్లూర్ ఎంపీపీ మస్త ప్రభాకర్ పై అవిశ్వాసం పెట్టి, అతడ్ని పదవి నుంచి తొలగించేందుకు ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్‌రెడ్డి కుట్ర చేస్తున్నాడని దళిత సంఘాల నాయకులు ఆరోపించారు.
ఆదివారం ఆర్మూర్ లో అంబేద్కర్ చౌరస్తా వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఆర్మూర్ ఎంపీపీ పస్క నర్సయ్య, జడ్పీటీసీ మెట్టు సంతోష్, వెల్మల్ రాజన్న, నీరడి ప్రభుదాస్, దయానంద్, ముత్యం, గంగాధర్ మాట్లాడుతూ.. ఎమ్మెల్యే పైడి రాకేశ్‌రెడ్డి దళిత నాయకులను అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారన్నారు.
ధనబలంతో ఎంపీటీసీలను కొనుగోలు చేసి, ఎంపీపీపై అవిశ్వాస కుట్ర పన్నడం సరికాదన్నారు. ఎమ్మెల్యే రాకేశ్‌రెడ్డికి వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శించారు.