బిగ్ బాస్ షో ద్వారా ఆంధ్ర-తెలంగాణ మధ్య కొట్లాటకు కుట్ర

  • బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్

హైదరాబాద్: బిగ్ బాస్ షోను వెంటనే నిషేధించాలని బీజేపీ ఎమ్మెల్యే రాజసింగ్ డిమాండ్ చేశారు. ఈ షో ద్వారా ఆంధ్ర, తెలంగాణకు కొట్లాట పెట్టే కుట్ర జరుగుతోందని ఆయన ఆరోపించారు. బిగ్ బాస్ షోపై వెంటనే దృష్టి సారించాలని సీఎం కేసీఆర్, హోంమంత్రికి విజ్ఞప్తి చేస్తున్నానని తెలిపారు. ఈ షోను ఎవరూ కుటుంబ సభ్యులతో కలసి షో చూడలేని పరిస్థితి ఉందన్నారు. హిందీలో సల్మాన్ ఖాన్ షోలో హిందువుల మనోభావాలను కించపరిచారని, వ్యాపారం ముసుగులో ప్రాంతీయ అసమానతలకు తెరతీస్తున్నారని రాజాసింగ్ మండిపడ్డారు. కమీషన్లు తీసుకుని అధికారులు షోలకు అనుమతి ఇస్తున్నారన్నారని రాజసింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.