ఎమ్మెల్యే ప్రేమ్​సాగర్​రావు ప్రతిష్ట దెబ్బతీసేందుకు కుట్ర

  •      న్యాయవాది పి. ప్రతాప్​ 

ఖైరతాబాద్,వెలుగు: కాప్రా పరిధిలోని వంపుగూడ భూముల వివాదంలో మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్​సాగర్​రావుకు ఎలాంటి సంబంధం లేదని ఆయన తరఫు న్యాయవాది పి.ప్రతాప్ అన్నారు. సోమవారం సోమాజిగూడ ప్రెస్​క్లబ్​లో  మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఎమ్మెల్యేను రాజకీయంగా ఆయనను దెబ్బతీసేందుకే  కొందరు కుట్రపన్ని  అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.   

ఆ భూముల అసలైన ఓనర్​సయ్యద్ అలీఖాన్​జాఫ్రి అన్నారు.  ఆయన1964లో నర్సారెడ్డికి  భూమిని అమ్మగా, ఆయన వద్ద శంషాబాద్​కు చెందిన సత్తయ్య కొనుగోలు చేసినట్టు గుర్తుచేశారు. మొత్తం 61.34 గుంటల భూమిలో ఎమ్మెల్యే ప్రేమ్​సాగర్​రావుకు సెంటు భూమి కూడా లేదని స్పష్టంచేశారు. ఆయనను ఎందుకు ఇరికిస్తున్నారని ప్రశ్నించారు.  ప్రస్తుతం ఆ భూమి  40 ఏండ్లుగా కోర్టు పరిధిలో ఉందన్నారు. 

ALSO READ : రుణమాఫీకి కండిషన్లు ఏంటి : ఏలేటి మహేశ్వర్ రెడ్డి

కొందరు రియల్​ఎస్టేట్​ఏజంట్లు కావాలనే ఆయన ప్రతిష్టను దెబ్బతీసేందుకు కుట్రపన్నారని న్యాయవాది పి.ప్రతాప్​ ఆరోపించారు . భూ కబ్జాదారుడు అంటూ కొందరు చేస్తున్న ఆరోపణలపై న్యాయపరంగా  క్రిమినల్​ చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.