
దేశాన్ని మతప్రాతిపదికన విభజించాలనే కుట్రలో భాగంగానే బీజేపీ వక్ఫ్‌బోర్డు బిల్లు తీసుకొచ్చిందని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అన్నారు. మీడియాతో ఆమె మాట్లాడారు. ‘‘బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం గద్దెదిగిన తర్వాత.. ఈ చట్టాన్ని రద్దు చేసే సవరణ తీసుకొస్తాం.
బీజేపీ ఓ ‘జుమ్లా పార్టీ’. ఈ బిల్లు ముస్లిం సమాజ హక్కులను హరిస్తున్నది. రాజ్యాంగవిలువలకు విరుద్ధంగా ఉన్నది’’అని మమతా బెనర్జీ అన్నారు.