రేవంత్​రెడ్డి సర్కారును కూల్చే కుట్ర

రేవంత్​రెడ్డి సర్కారును కూల్చే కుట్ర
  • హైకోర్టు న్యాయవాది పోడూరి శ్రీనివాస్​రెడ్డి ఆరోపణ 
  • అల్లు అర్జున్​ బెయిల్​ రద్దయ్యే చాన్స్​ఉందని కామెంట్

ఖైరతాబాద్, వెలుగు: సినీ హీరో అల్లు అర్జున్​కేసును అడ్డం పెట్టుకుని రేవంత్​రెడ్డి సర్కార్​ను కూల్చేందుకు ప్రతిపక్షాలు కుట్ర చేస్తున్నాయని హైకోర్టు న్యాయవాది పోడూరి శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. అల్లు అర్జున్​వెనుక బీఆర్ఎస్​నేతలు కేటీఆర్, కవిత, హరీశ్​రావుతోపాటు కేంద్ర మంత్రి కిషన్​ రెడ్డి ఉన్నారని చెప్పారు. మంగళవారం ఆయన సోమాజిగూడ ప్రెస్​క్లబ్​లో జర్నలిస్ట్​సతీశ్​కమల్​తో కలిసి మీడియాతో మాట్లాడారు.

 తొక్కిసలాటలో గాయపడి చికిత్స పొందుతున్న శ్రీతేజ్​ను బీఆర్ఎస్​నేతలు ఎవరూ ఇంత వరకు పరామర్శించలేదన్నారు. సినీ పరిశ్రమ ఇక్కడి నుంచి వెళ్లిపోవాలనుకుంటే గతంలో తీసుకున్న భూములను వదిలేసి వెళ్లాలన్నారు. బీఆర్ఎస్, బీజేపీ నాయకులు రాష్ట్రంలో ఏదో ఒక అలజడి సృష్టించి ప్రభుత్వాన్ని కూలదోయాలని చూస్తున్నారని ఆరోపించారు. కండీషనల్​బెయిల్​పై ఉన్న అల్లు అర్జున్​ ప్రెస్​ మీట్​పెట్టి కోర్టు నిబంధనలను ధిక్కరించారని,పోలీసులు బెయిల్ రద్దుకు పిటిషన్​దాఖలు చేసే అవకాశం ఉందన్నారు. శ్రీతేజ్​కుటుంబానికి డబ్బు ఇస్తామని అల్లు అర్జున్​చెప్పడం బాధితులను ప్రలోభపెట్టి కేసు వాపస్​ తీసుకునేలా చేయడమేనన్నారు.