ట్యాంక్​బండ్​పై అంబేద్కర్ విగ్రహం లేకుండా చేసే కుట్ర

ట్యాంక్​బండ్​పై అంబేద్కర్ విగ్రహం లేకుండా చేసే కుట్ర
  • మాల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బత్తుల రాంప్రసాద్ ఆరోపణ
  • జీహెచ్ఎంసీ గోడ కడితే మళ్లీ కూలుస్తామని హెచ్చరిక

ఖైరతాబాద్, వెలుగు: ట్యాంక్​బండ్​పై అంబేద్కర్​విగ్రహాన్ని కనుమరుగు చేసేందుకు కుట్ర చేస్తున్నారని మాల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బత్తుల రాంప్రసాద్ ఆరోపించారు. అందులో భాగంగానే జీహెచ్ఎంసీ అధికారులు విగ్రహం ముందు గోడ కట్టారన్నారు. దళిత సంఘాల నేతలు మంత్రి నర్సింహయ్య, మణిదీప్, బి.సత్యనారాయణ, ఉమాకాంత్​రావు, దుబ్బాక నవీన్ తో కలిసి గురువారం ఆయన సోమాజిగూడ ప్రెస్​క్లబ్​లో మీడియాతో మాట్లాడారు.

తాము బ్యూటిఫికేషన్​కు వ్యతిరేకం కాదని, అంబేద్కర్​విగ్రహం వెనుక ఎలాంటి పనులైనా చేసుకోండని చెప్పారు. విగ్రహం ముందు గోడ నిర్మిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. గోడ కట్టాలని జీహెచ్ఎంసీ అధికారులు ప్రయత్నిస్తే మళ్లీ కూలుస్తామన్నారు. 1971 నుంచి విగ్రహం మెయింటెనెన్స్ ను తామే తామే చూసుకుంటున్నామని, దళిత ఉద్యమ నేతలపై ఇష్టమొచ్చినట్లు కామెంట్​చేసిన కాంగ్రెస్​నేత అనిల్​పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలని, లేకుంటే గాంధీభవన్​ను ముట్టడిస్తామని హెచ్చరించారు.