అమిత్షాను కాపాడటం కోసమే..కొట్టినట్లు బీజేపీ డ్రామా: ఎంపీ ప్రియాంక గాంధీ

అమిత్షాను కాపాడటం కోసమే..కొట్టినట్లు బీజేపీ డ్రామా: ఎంపీ ప్రియాంక గాంధీ

పార్లమెంట్లో ఎంపీపై దాడి చేసినట్లు బీజేపీ డ్రామా ఆడుతుందని..అంబేద్కర్పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలను డైవర్ట్ చేయటానికే.. కుట్రలో భాగంగా బీజేపీ ఈ విషయాన్ని తెరపైకి తెస్తుందంటూ తీవ్రంగా మండిపడ్డారు వయనాడ్ ఎంపీ, కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ.

రాహుల్ గాంధీ బీఆర్ అంబేద్కర్ ఫొటో పట్టుకుని జై భీమ్ నినాదం చేస్తూ శాంతియుతంగా పార్లమెంట్ లోపలికి వెళ్తుంటే .. ఆయనను లోపలికి వెళ్లకుండా అడ్డుకుంది బీజేపీ నేతలు కాదా అని ప్రియాంకాగాంధీ ప్రశ్నించారు.

ALSO READ | అసలు జరిగింది ఇది: బీజేపీ ఎంపీని తోసేయడంపై రాహుల్ గాంధీ క్లారిటీ

మేం ఇన్ని రోజులుగా నిరసనలు తెలుపుతున్నాం.. ఎవరికి ఆటంకం కలిగించలేదు.. ఇవాళ బీజేపీ ఎంపీలు కావాలనే నిరసన డ్రామాతో రాహుల్ ను అడ్డుకుని గుండాగిరి చేశారని ప్రియాంక అన్నారు. 

రాజ్యాంగ నిర్మాత బీఆర్అంబేద్కర్ ను అవమానపర్చిన కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కాపాడేందుకే ఈ కుట్ర చేశారని విమర్శించారు ప్రియాంకగాంధీ. అమిత్ షాను రక్షించేందుకు రాహుల్ గాంధీని పార్లమెంట్ నుంచి బయటికి పంపేందుకు యత్నిస్తున్నారని ప్రియాంక అన్నారు.