సీసీఐ సిమెంట్​ పరిశ్రమను అదానీకి అమ్మే కుట్ర.. బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యే రాజీనామా చేయాలె: సీపీఎం

సీసీఐ సిమెంట్​ పరిశ్రమను అదానీకి అమ్మే కుట్ర.. బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యే రాజీనామా చేయాలె: సీపీఎం

=సీసీఐ సిమెంట్​ పరిశ్రమ పునరుద్దరించాలె
=అన్ని పార్టీలతో కలిసి ఉద్యమం చేస్తం
=సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్​ వెస్లీ

ఆదిలాబాద్​: ఆదిలాబాద్​ జిల్లా కేంద్రంలోని సీసీఐ సిమెంట్​ పరిశ్రమను అదానీకి అమ్మేందుకు కేంద్రం కుట్ర చేస్తుందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ ఆరోపించారు. పరిశ్రమను అమ్మితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. జిల్లా ‌కేంద్రంలో‌‌ ‌మూతపడ్డ సీసీఐ సిమెంట్ పరిశ్రమను ఆయన ఇవాళ (మార్చి 28) సందర్శించారు. వెంటనే పరిశ్రమను పున:ప్రారంభించాలని డిమాండ్​ చేశారు. 

పరిశ్రమ కోసం మాటిచ్చి తప్పిన బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యే ఇద్దరూ రాజీనామా చేయాలన్నారు. సిమెంట్​ పరిశ్రమ పునరుద్దరణ కోసం పార్లమెంట్​ వేదికగా ఉద్యమిస్తామన్న జాన్​ వేస్లీ... అన్ని పార్టీలతో కలిసి ఉద్యమాన్ని ఉదృతం చేస్తామన్నారు.