రాష్ట్రాన్ని మణిపూర్​లా మార్చే కుట్ర: మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్​

హైదరాబాద్, వెలుగు: మణిపూర్​లాగానే  తెలంగాణనూ రావణకాష్టంలా మార్చేందుకు బీజేపీ కుట్ర పన్నుతున్నదని కాంగ్రెస్​ నేత, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్​ ఆరోపించారు. లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించేందుకు కుకీలలా ఇక్కడా పోరాటం చేయాలంటూ బీజేపీ ఎంపీ సోయం బాపురావు అనడం దారుణమన్నారు. గురువారం ఆయన పీసీసీ వైస్​ ప్రెసిడెంట్ చామల కిరణ్​ కుమార్​ రెడ్డితో కలిసి గాంధీ భవన్​లో మీడియాతో మాట్లాడారు. రెండు తెగల మధ్య చిచ్చుపెట్టేలా బాపురావు వ్యాఖ్యలు చేశారంటూ మండిపడ్డారు. సోయం వెనుక సీఎం కేసీఆర్​ ఉన్నారన్నారు. సోయంపై రాష్ట్రపతికి, లోక్​సభ స్పీకర్​కు ఫిర్యాదు చేస్తానని చెప్పారు. 

ALSO READ :అతలాకుతలం.. ఇండ్లలోకి నీరు చేరి జనం పాట్లు