మద్యం సేవించాడని మరీ ఇంతలా కొడతారా..? కామారెడ్డి జిల్లాలో కానిస్టేబుల్, హోంగార్డు సస్పెండ్

మద్యం సేవించాడని మరీ ఇంతలా కొడతారా..? కామారెడ్డి జిల్లాలో కానిస్టేబుల్, హోంగార్డు సస్పెండ్

కామారెడ్డి జిల్లాలో కానిస్టేబుల్, హోమ్ గార్డు ఓవర్ యాక్షన్ తో ఒకవ్యక్తి తీవ్ర గాయాలతో ఆస్పత్రి పాలు అవ్వాల్సి వచ్చింది. మద్యం సేవించాడనే కారణంతో నడిరోడ్డుపై వ్యక్తిని చితకబాదడం జిల్లా వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ వ్యవహారంపై తీవ్ర విమర్శలు రావడంతో ఇద్దరినీ సస్పెండ్ చేశారు జిల్లా ఎస్పీ.

వివరాల్లోకి వెళ్తే.. బాన్సువాడ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వర్తించే కానిస్టేబుల్ కిరణ్, హోం గార్డు గంగాధర్ ఓవర్ యాక్షన్ కారణంగా సస్పెండ్ అయ్యారు. మద్యం తాగాడని ఓ వ్యక్తిని నడిరోడ్డుపై చితక బాదారు. ‘‘మాకే ఎదురు చెప్తావా..?’’ అంటూ విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ దాడిలో బాధితునికి తీవ్ర గాయాలయ్యాయి.

Also Read :- ఎవిడెన్స్ లేకుండా వైన్స్లో చోరీ.. 

విధి నిర్వహణ లో పోలీసులు దురుసుగా వ్యవహరించడం జిల్లా ఎస్.పి. రాజేష్ చంద్ర దృష్టికి వచ్చింది. జిల్లా వ్యాప్తంగా ఈ వ్యవహారం సంచలనంగా మారి తీవ్ర విమర్శలు రావడంతో ఇద్దిరిపై క్రమశిక్షణా చర్యలు తీసుకున్నారు ఎస్పీ. కానిస్టేబుల్ కిరణ్, హోం గార్డు గంగాధర్ లను విధుల నుండి సస్పెండ్ చేశారు.