తనిఖీలు చేస్తున్న కానిస్టేబుల్‌నూ ఈడ్చుకెళ్లిండు
మిర్యాలగూడలో మద్యం తాగిన వ్యక్తి హల్చల్
మిర్యాలగూడ, వెలుగు: ఎంత మద్యం తాగిండో చూద్దామని నోటి వద్ద పెట్టిన బ్రీత్ ఎనలైజర్ సహా కానిస్టేబుల్‌నూ కారుతోపాటు లాక్కెళ్లాడో వ్యక్తి. ఈ ఘటన నల్గొండ జిల్లా మిర్యాలగూడలో చోటుచేసుకుంది. ట్రాఫిక్ ఎస్ఐ కోటేష్ ఆధ్వర్యంలో సోమవారం రాత్రి పోలీసులు మిర్యాలగూడలోని హనుమాన్‌పేట ప్లై ఓవర్ వద్ద డ్రంక్ అండ్డ్రైవ్ నిర్వహిస్తున్నారు. కారులో వచ్చిన ఓ వ్యక్తి వద్దకు వెళ్లిన కానిస్టేబుల్లింగారెడ్డి.. బ్రీత్ఎనలైజర్మిషన్ నోటి వద్ద ఉంచాడు.
సదరు వ్యక్తి ఆ మిషన్‌ను లాక్కుని కారును ముందుకు పోనిచ్చాడు. కానిస్టేబుల్ కారు డోర్‌ను పట్టుకుని 50 మీటర్ల వరకు పరిగెత్తాడు. అయినా కారు ఆపలేదు. ఈ క్రమంలో కానిస్టేబుల్‌కు గాయాలయ్యాయి. సదరు వ్యక్తిపై కేసు నమోదు చేశామని, అతడి కోసం గాలింపు చేపట్టామని డీఎస్పీ వెంకటగిరి తెలిపారు. బ్రీత్ఎనలైజర్మిషన్ కూడా లభ్యం కాలేదన్నారు.