సూర్యాపేట జిల్లాలో దసరా ఉత్సవాల్లో ఓ కానిస్టేబుల్ వీరంగం సృష్టించాడు. మూత్రవిసర్జన గురించి మొదలైన ఘర్షణ తలలు పగిలెవరకు వెళ్ళింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. శనివారం ( అక్టోబర్ 12, 2024 ) దసరా ఉత్సవాలు జరుగుతుండగా ఓ వ్యక్తి ఆలయ పరిధిలో మూత్రవిసర్జన చేసాడు. మూత్రవిసర్జన చేస్తున్న వ్యక్తి వెనుక నుండి ఫొటో తీస్తూ అతన్ని కాలితో తన్నాడు ఏఆర్ కానిస్టేబుల్. అంతే కాకుండా ఆ ఫోటోను వాట్సాప్ గ్రూప్స్ లో పోస్ట్ చేశాడు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం మొదలైంది.
ఇద్దరి వాగ్వాదం కాస్తా.. గ్రామంలోని బీసీ, ఎస్సీ వర్గాల మధ్య ఘర్షణకు దారి తీసింది. ఇరువర్గాలు రాళ్లు, పైపులతో దాడికి దిగిన ఈ ఘర్షణలో మాజీ సర్పంచ్ ను వెనక నుండి తన్నాడు ఏఆర్ కానిస్టేబుల్. ఈ ఘర్షణలో మాజీ సర్పంచ్ వర్గీయుడి తల పగలగా.. ఇరువర్గాలను చెదరగొట్టేందుకు ప్రయత్నించిన కోదాడ సీఐ తల కూడా పగిలింది. ఏఎస్ఐ పై చేయి చేసుకొని ఘర్షణకు కారకుడైన ఏఆర్ కానిస్టేబుల్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు చిలుకూరు పోలీసులు.