
కామారెడ్డి జిల్లాలో కానిస్టేబుల్ వీరంగం సృష్టించాడు. తమ్ముడి భార్య, పిల్లలపై విచక్షణ రహితంగా దాడి చేశాడు. వెదురు కర్రతో కారు అద్దాలను పగలగొట్టి, అడ్డొచ్చిన వారిపై దాడికి దిగాడు. పొరుగున ఉన్న వాళ్లు ఆపే ప్రయత్నం చేసినా తగ్గలేదు.
కామారెడ్డి జిల్లా బిక్నూర్ లో జరిగింది ఈ ఘటన. సంతోష్ అనే కానిస్టేబుల్ చేసిన వీరంగంతో గ్రామంలో కాసేపు భయాందోళన నెలకొంది. తమ్ముడి భార్య, చిన్న పిల్లలు కూడా అని కూడా చూడకుండా విచక్షణ మరిచి కొట్టడంతో తీవ్రంగా గాయపడ్డారు.
కానిస్టేబుల్ సంతోష్ అగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ ( బాన్స్ వాడ) కాసుల బాల్ గన్ మెన్ గా విధులు నిర్వహిస్తున్నాడు. సంతోష్ దారుణంగా కొట్టడంతో తమ్ముడి భార్య నవ్య , పిల్లలకు గాయాలు అయ్యాయి. గాయపడిన మహిళ బిక్ నూర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.