జగిత్యాల టౌన్, వెలుగు: 1989లో జగిత్యాల జిల్లా నుంచి ఎంపికైన కానిస్టేబుల్ బ్యాచ్‌కు చెందిన పలువురు పోలీసులు ఆదివారం పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్‌లో కలుసుకున్నారు. బ్యాచ్‌కి 35ఏండ్లు పూర్తయిన సందర్భంగా వివిధ హోదాల్లో పనిచేస్తున్న ఆఫీసర్లు ఒక్కచోట చేరి ఉత్సహంగా గడిపారు. బ్యాచ్‌లో కొందరు చనిపోగా వారికి నివాళులర్పించారు. బ్యాచ్ నుంచి ఉన్నత స్థాయికి వెళ్లిన వారిని సన్మానించారు.
కార్యక్రమంలో జగిత్యాల డీఎస్బీ ఎస్ఐ సుధీర్ రావు, ట్రాఫిక్ ఎస్ఐ రామచంద్రం, ఏఎస్ఐలు అంజయ్య, కరుణాకర్, మల్లయ్య, రాజేశ్, శ్రీనివాస్, గంగాధర్ ఉన్నారు