హైదరాబాద్ : కానిస్టేబుల్ అభ్యర్థులు తెలంగాణ సచివాలయాన్ని ముట్టడించారు. జీవో నెంబర్ 46ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ.. సచివాలయం గేటు ముందు బైఠాయించి.. నిరసన తెలిపారు. కానిస్టేబుల్ అభ్యర్థులను పోలీసుల అదుపులోకి తీసుకోవడంతో ఇరు వర్గాల మధ్య వాగ్వివాదం జరిగింది. ఈ క్రమంలో తోపులాట చోటు చేసుకోవడంతో ఉద్రిక్తత ఏర్పడింది.
2022 నోటిఫికేషన్ లో కానిస్టేబుల్ నియామకాల్లో తీసుకువచ్చిన జీవో నెంబర్ 46 రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పాత పద్ధతిలోనే నియమాకాలు చేపట్టి... గ్రామీణ ప్రాంత విద్యార్థులకు న్యాయం చేయాలని కోరారు. జీవో నెంబర్ 46 వల్ల తాము తీవ్రంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
ALSO READ :అబద్దం చెప్పాడు.. కాకి పొడిచింది : ఆప్ ఎంపీపై సెటైర్లు
కానిస్టేబుల్ అభ్యర్థులపై కేసులు నమోదు
తెలంగాణ సచివాలయాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించిన కానిస్టేబుల్ అభ్యర్థులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. సుమారు 50 మంది అభ్యర్థులపై కేసులు పెట్టారు. జీవో 46 రద్దు చేయాలంటూ ఈ మధ్యే డీజీపీ కార్యాలయాన్ని ముట్టడించిన విషయం తెలిసిందే.