![పోలీస్ కారులోనే తుపాకీతో కాల్చుకుని కానిస్టేబుల్ ఆత్మహత్య](https://static.v6velugu.com/uploads/2024/11/constable-committed-suicide-by-firing-a-gun-inside-the-police-car_JUCSmsngDh.jpg)
ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాలో కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీస్ ఎస్కార్ట్ వాహనంలోనే తుపాకీతో కాల్చుకుని సూసైడ్ చేసుకున్నాడు. గుంటూరులో శృంగేరి పీఠాధిపతి ఎస్కార్ట్‌లో 2024, నవంబర్ 22వ తేదీ శుక్రవారం ఈ ఘటన చోటు చేసుకుంది. కానిస్టేబుల్ ఆత్మహత్యపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతి చెందిన కానిస్టేబుల్‌ను ఏఆర్ కానిస్టేబుల్ వంశీగా గుర్తించారు. మృతుడు ఇటీవలే ఏపీఎస్పీ నుండి ఏఆర్‌కు ట్రాన్స్ఫర్ అయినట్లు సమాచారం. కానిస్టేబుల్ వంశీ ఆత్మహత్యకు కారణం ఇంటర్నల్ ప్రాబ్లమ్సా లేక మరేదైనా కారణం ఉందా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.