పిట్లంలో ఘటన .. యాక్సిడెంట్ లో కానిస్టేబుల్ మృతి

పిట్లంలో  ఘటన .. యాక్సిడెంట్ లో కానిస్టేబుల్ మృతి

పిట్లం, వెలుగు: యాక్సిడెంట్ లో కానిస్టేబుల్ చనిపోయిన ఘటన నిజామాబాద్ జిల్లాలో జరిగింది.  ఎస్ఐ రాజు తెలిపిన ప్రకారం.. పిట్లం పీఎస్ కానిస్టేబుల్​బుచ్చయ్యచారి(35) గురువారం రాత్రి డ్యూటీ ముగించుకుని బైక్ పై బాన్సువాడకు వెళ్తున్నాడు.

 రాత్రి11 గంటల సమయంలో  సిద్దాపూర్​చెరువు కట్ట వద్ద ఈత చెట్టుకు ఢీకొట్టాడు. దీంతో అతని ఛాతికి, తలకు తీవ్రగాయాలపై స్పాట్ లో చనిపోయాడు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.