వెలుగు: గుండెపోటుతో కానిస్టేబుల్ మృతి చెందిన ఘటన మహబూబాబాద్ జిల్లాలో జరిగింది. దంతాలపల్లి మండలంలోని పెద్దముప్పారం గ్రామానికి చెందిన పోలోజు సోమేశ్వర్ (55) డోర్నకల్ పోలీసుస్టేషన్ లో రైటర్. ఆదివారం ఉదయం విధుల్లో ఉండగా అతనికి గుండెపోటు రావడంతో తోటి సిబ్బంది ఆస్పత్రికి తరలిస్తుండగానే చనిపోయాడు.
సాయంత్రం కానిస్టేబుల్ అంత్యక్రియలు సొంతూరులో నిర్వహించగా.. జిల్లా ఎస్పీ సుధీర్ రామ్ నాథ్ కేకన్ పూలమాల వేసి నివాళులర్పించారు. కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. మృతుడికి భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.