
బెట్టింగ్ యాప్ ప్రమోటర్లపై కొరడా ఝులిపిస్తున్నారుపోలీసులు. సోషల్ మీడియాలో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ చేస్తున్న యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్ ఫ్ల్యూయెన్సర్లపై కేసులు నమోదు చేస్తున్నారు పోలీసులు. ఇప్పటికే 11 మంది యూట్యూబర్లపై కేసులు నమోదు చేసిన పోలీసులు లేటెస్ట్ గా బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసిన కానిస్టేబుల్ కిరణ్ గౌడ్ పై కేసు నమోదు చేశారు.
హబీబ్ నగర్ పీఎస్‌లో పనిచేస్తున్న కిరణ్‌గౌడ్ గత కొన్ని రోజులుగా టెలిగ్రామ్ చానెల్‌లో బెట్టింగ్ టిప్స్ ఇస్తున్నాడు. యూనిఫాంలో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న కిరణ్‌గౌడ్‌పై పంజాగుట్ట పీఎస్‌లో కేసు నమోదయ్యింది. కిరణ్ పాత్రపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
మార్చి 17న 11 మంది తెలుగు యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్ ఫ్లూయన్సర్లు విష్ణుప్రియ, బండారు శేషసాయిని సుప్రిత, ఇమ్రాన్ ఖాన్ (పరేషన్ బాయ్స్), హర్ష సాయి, రీతు చౌదరి , టేస్టీ తేజ, యాంకర్ శ్యామల, కిరణ్ గౌడ్, అజయ్, సన్నీ యాదవ్, సుదీర్ లపై గేమింగ్ యాక్ట్ కింద పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. బీఎన్ఎస్ 318(4), 3, 3(A), 4 TSGA, 66D ITA Act-2008 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
ALSO READ | బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ లో విజయ్ దేవరకొండ, నిధి అగర్వాల్.. కేసు పెడాతారా..?
బెట్టింగ్ యాప్స్ వల్ల అప్పల పాలై తెలంగాణలో గతేడాది వెయ్యి మంది ఆత్మహత్య చేసుకున్నారు. ఇందులో యువతతో పాటు చిరు వ్యాపారులు, చిరు ఉద్యోగులు కూడా ఉన్నారు. ప్రముఖ యూట్యూబర్స్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్తో యాప్స్‌ను ప్రమోట్ చేయించుకుంటూ.. సామాన్యులను తమ విషవలయంలోకి యాప్స్ నిర్వాహకులు లాక్కుంటున్నారు. ఈ దందాకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో వార్ మొదలైంది. బెట్టింగ్ యాప్స్ వ్యవహారాన్ని ప్రభుత్వం కూడా సీరియస్‌గా తీసుకున్నది.