ఫిర్యాదు చేసేందుకు వచ్చిన యువతిని గర్భవతిని చేశాడు.. ఆ తర్వాత ఏమైందంటే..

ఫిర్యాదు చేసేందుకు వచ్చిన యువతిని గర్భవతిని చేశాడు.. ఆ తర్వాత ఏమైందంటే..

తమ  సమస్య చెప్పుకునేందుకు వచ్చిన ఓ యువతిని గర్భవతిని చేశాడు ఓ పోలీస్ కానిస్టేబుల్. యువతి గర్భం దాల్చడంతో బెదిరింపులకు పాల్పడ్డాడు. తప్పించుకోవాలని చూశాడు. తనకు న్యాయం చేయాలని అడిగినందుకు దాడి చేశాడు. ఈ ఘటన మేడ్చల్ పోలీస్ స్టేషన్ లో జరిగింది. 

మేడ్చల్ కు చెందిన ఓ యువతి తన సమస్యపై ఫిర్యాదు చేసేందుకు  కుటుంబతో కలిసి పోలీస్‌స్టేషన్‌ ను ఆశ్రయించింది. అయితే వారి సమస్యను తీరుస్తాన్న పోలీసు కానిస్టేబుల్ ఆ తర్వాత కీచకునిగా మారాడు. సమస్య తీర్చి న్యాయం చేస్తానని నమ్మబలికి సన్నిహితంగా మెలిగాడు.  తన కామ కోర్కె తీర్చుకుని చివరకు ఆమెను గర్భవతిని చేశాడు.

తను గర్భవతి అని తెలుసుకున్న యువతి న్యాయం చేయాల్సిందిగా వేడుకుంది. దీంతో ఆమెను వదిలించుకునేందుకు యువతిపై బెదిరింపులు, దాడికి పాల్పడ్డాడు.  దీంతో కానిస్టేబుల్ తనను మోసం చేశాడని, ప్రాణహాని ఉందంటూ పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లింది. విషయం తెలుసుకున్న పోలీసులు  కేసు నమోదు చేసి కానిస్టేబుల్‌ను రిమాండ్‌ పంపించేశారు.