తల్లి చెంతకు చేరిన తప్పిపోయిన బాలుడు

నవీపేట్, వెలుగు: తప్పిపోయిన బాలుడిని గమనించిన కానిస్టేబుల్​ తల్లికి అప్పగించాడు. నవీపేట్​కు చెందిన చాకలి సాయిలు కొడుకు సాయంత్రం తప్పిపోయి టౌన్​లోని ఢిల్లీ వాలా స్వీట్ హోమ్ వద్ద ఏడుస్తూ ఉన్నాడు. అటుగా వెళ్తున్న కానిస్టేబుల్ శ్రీనివాస్ బాలుడిని గమనించాడు. బాబు తన ఇంటి అడ్రస్​ చెప్పలేకపోయాడు. చాకచక్యంగా వ్యవహరించిన కానిస్టేబుల్ ​సోషల్​మీడియాలో బాలుడి ఫొటోను పోస్ట్​ చేశాడు. విషయం తెలిసి బాలుడి తల్లి రాగా, ఆమెకు అప్పగించాడు.