నల్గొండ జిల్లాలో.. గుండెపోటుతో కానిస్టేబుల్‌‌ మృతి

  • వాకింగ్  చేసి ఇంటికొచ్చాక కుప్పకూలాడు

హాలియా, వెలుగు : గుండెపోటుతో ఓ పోలీస్ కానిస్టేబుల్ గురువారం మృతి చెందాడు. నల్గొండ జిల్లా అనుముల మండలం అలీనగర్ కు చెందిన షేక్ నజీర్ (35) కొంత కాలంగా నల్గొండ జిల్లా కేంద్రంలోని వన్​ టౌన్  పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాడు.  గురువారం ఉదయం నజీర్  వాకింగ్​ చేయడానికి గ్రౌండ్ కి వెళ్లి ఇంటికి తిరిగివచ్చాడు. ఇంట్లోకి రాగానే గుండెపోటుతో ఒక్కసారిగా కుప్పకూలాడు. వెంటనే కుటుంబ సభ్యులు ఆయనను హాస్పిటల్ కు తరలిస్తుండగా మార్గం మధ్యలో చనిపోయాడు.

మృతునికి భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. కాగా, నజీర్​ జాతీయ స్థాయి కబడ్డీ క్రీడాకారుడిగా మంచి గుర్తింపు పొందాడు. ఆయన​భౌతికకాయాన్ని మృతుడి స్వగ్రామం అలీనగర్ లో నాగార్జున్ సాగర్​ ఎమ్మెల్యే కుందూరు జైవీర్​ రెడ్డి సందర్శించి కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు. పోలీసులు గౌరవ వందనం మధ్య ఆయన అంత్యక్రియలు పూర్తయ్యాయి.