
మెదక్ టౌన్, వెలుగు: మెదక్‌జిల్లాకు చెందిన కానిస్టేబుల్ ప్రభాకర్రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ప్రతిభ కనబరిచి రజత పతకం సాధించారు. జిల్లా ఏఎస్పీ మహేందర్ బుధవారం ఎస్పీ ఆఫీసులో కానిస్టేబుల్ప్రభాకర్ ను సన్మానించారు. గత నెల 30, 31 తేదీల్లో హైదరాబాద్గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన రాష్ట్ర స్థాయి మాస్టర్ అథ్లెటిక్ పోటీల్లో జిల్లా పోలీస్ ఆర్ముడ్ విభాగానికి చెందిన ప్రభాకర్ 100 మీటర్ల పరుగు పందెంలో ఉత్తమ ప్రతిభ కనబరచి రెండో స్థానంలో నిలిచారు. ప్రభాకర్ప్రస్తుతం మెదక్ జిల్లా పరిషత్‌చైర్ పర్సన్హేమలత వద్ద గన్‌మన్‌గా విధులు నిర్వహిస్తున్నారు.