అధికారిక లాంఛనాలతో కానిస్టేబుల్ ​అంత్యక్రియలు

అధికారిక లాంఛనాలతో కానిస్టేబుల్ ​అంత్యక్రియలు

మునగాల, వెలుగు : మునగాల పోలీస్ స్టేషన్ పరిధిలోని ముకుందాపురం వద్ద జాతీయ రహదారి 65పై సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్ రాంబాబు మృతి చెందాడు. మంగళవారం మునగాలలో ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో రాంబాబు అంత్యక్రియలు నిర్వహించారు. ఎమ్మెల్యే పద్మావతిరెడ్డి, ఎస్పీ నరసింహ, పోలీస్​అధికారులు, నాయకులు రాంబాబు మృతదేహాన్ని సందర్శించి పూలమాల వేసి నివాళులర్పించారు. 

దహన సంస్కారాల కోసం మృతుడి కుటుంబానికి పోలీస్​శాఖ నుంచి ఆర్థిక సాయం అందించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ కానిస్టేబుల్​ రాంబాబు మృతి చెందడం బాధాకరమన్నారు. మృతుడి కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. రాంబాబు మృతికి నివాళులర్పించిన వారిలో కోదాడ డీఎస్పీ శ్రీధర్​రెడ్డి, మునగాల సర్కిల్ సీఐ రామకృష్ణారెడ్డి, సూర్యాపేట పట్టణ ఇన్​స్పెక్టర్ వీరరాఘవులు, పోలీసు సంఘం అధ్యక్షుడు రామచందర్ గౌడ్, మునగాల ఎస్ఐ ప్రవీణ్ కుమార్, కోదాడ ట్రాఫిక్ ఎస్ఐ మల్లేశం, నాయకులు ఉన్నారు.