ఖమ్మం టౌన్/సత్తుపల్లి, వెలుగు : సత్తుపల్లి పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తూ ఇటీవల అనారోగ్యంతో మరణించిన కానిస్టేబుల్ పి.వెంకటకృష్ణ కుటుంబ సభ్యులకు రూ. 7,99,790 భద్రత ఎక్స్గ్రేషియా చెక్కు ను శనివారం సీపీ సునీల్ దత్ అందజేశారు.
ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ బాధిత పోలీసు కుటుంబాలకు శాఖపరంగా ఎటువంటి సహాయం అందించేందుకైనా సిద్ధంగా ఉన్నామని తెలిపారు.